దావణగెరె, బాగల్‌కోటెలో ప్రచారం సమాప్తం | - | Sakshi
Sakshi News home page

దావణగెరె, బాగల్‌కోటెలో ప్రచారం సమాప్తం

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

సాక్షి బళ్లారి: రాష్ట్రంలో దావణగెరె దక్షిణ, బాగల్‌కోటె అసెంబ్లీ క్షేత్రాల బహిరంగ ప్రచారం మంగళవారం సాయంత్రంతో సమాప్తమైంది. ఉదయం నుంచి కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు జోరుగా ప్రచారం చేశారు. దావణగెరెలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బుధవారం సందడి లేకుండా ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. గురువారం పోలింగ్‌ జరుగుతుంది. నియోజకవర్గాలకు చెందని వారందరూ వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దావణగెరె దక్షిణలో కాంగ్రెస్‌ నుంచి శామనూరు సమర్థ్‌, బీజేపీ నుంచి శ్రీనివాస దాస కరియప్ప బరిలో ఉన్నారు. బాగల్‌కోటెలో కాంగ్రెస్‌ నుంచి ఉమేష్‌ మేటి, బీజేపీ అభ్యర్థి చరంతిమఠ తలపడుతున్నారు. మరోవైపు పోలింగ్‌కు ఆయా జిల్లాల యంత్రాంగాలు ఏర్పాట్లు చేపట్టాయి. సిబ్బంది బుధవారం సాయంత్రం ఈవీఎంలను తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరతారు.

9న పోలింగ్‌కు సన్నాహాలు

Advertisement
 
Advertisement
Advertisement