బళ్లారిటౌన్: జిల్లాలో తల్లీ శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అధికారులు జాగ్రత్త వహించాలని డీఎంహెచ్‌ఓ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సభాంగణంలో ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సిజేరియన్ కాన్పుల్లో మరణాలను 20 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేయాలన్నారు.
ప్రాణాపాయం నుంచి 75 మందికి రక్షణ
2025–26వ సంవత్సరంలో బళ్లారి వైద్య విజ్ఞాన కళాశాల పరిశోధన కేంద్ర నుంచి 54 మంది, జిల్లా ఆస్పత్రి నుంచి 24 మంది తల్లులను ప్రాణాపాయం నుంచి కాపాడి మరణాల సంఖ్యను నియంత్రించినట్లు ఆయన వెల్లడించారు. వీటి నియంత్రణ, మరింతగా తగ్గించేందుకు జాగృతి కల్గించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆర్‌సీహెచ్ అధికారులు హనుమంతప్ప, వివిధ అధికారులు హెచ్‌ఈ రామరాజు, వైద్యులు డాక్టర్ విశ్వనాథ్, రిజేష్, ప్రశాంత్, బాల వెంకటేశ్వరరావు, అబ్దుల్, సునీల్, అరుణ్, మంజునాథ్, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
దావణగెరె దక్షిణ మొత్తం ఓటర్లు 2,31,072
● పురుషులు 1,13,399, మహిళలు 1,17,690 మంది
● కొత్తగా పేర్లు చేర్పించుకున్న
యువ ఓటర్లు 2,870 మంది
బళ్లారి రూరల్ : దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,31,072 మంది ఉన్నట్లు దావణగెరె ఎన్నికల అఽధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు. వీరిలో పురుషులు 1,13,399 మంది కాగా మహిళలు 1,17,690 మంది, ట్రాన్స్‌జెండర్స్ 43 మంది ఉన్నట్లు తెలిపారు. మొత్తం యువ ఓటర్లు 2,870 కాగా వీరిలో 1,494 మంది యువకులు, 1,376 మంది యువతులు ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగులు మొత్తం 2,512 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,375 మంది కాగా మహిళలు 1,137 మంది ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన వయోవద్ధులు 1,974 మంది ఉండగా వీరిలో పురుషులు 891 మంది కాగా మహిళలు 1,083 మది ఉన్నారు. 100 ఏళ్ల వయస్సు పైబడిన వయోవృద్ధులు 28 మంది ఉండగా వీరిలో పురుషులు 8 మంది, మహిళలు 20 మంది ఉన్నట్లు తెలిపారు. సర్వీసు ఓటర్లు మొత్తం 35 మంది ఉండగా, వీరిలో పురుషులు 34 మంది, మహిళలు ఒకరు ఉన్నట్లు తెలిపారు.
వరిగడ్డి వాముల దగ్ధం
● రూ.2 లక్షల మేర నష్టం
హొసపేటె: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 10 పశుగ్రాసం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలోని దేవర తిమ్లాపుర గ్రామంలో సోమవారం జరిగింది. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా వరదహళ్లి హనుమంతప్ప అనే రైతుకు చెందిన కుప్పలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కుప్పలకు నిప్పంటుకొని పూర్తిగా కాలి పోయాయి. సుమారు రూ.2 లక్షల విలువైన పశుగ్రాసం బూడిదైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రానందుకు పశుగ్రాసం కుప్పలు పూర్తిగా కాలిపోయాయని రైతు వాపోయారు.


