నిరసనకారులతో ‘నారా’ చర్చలు సఫలం | - | Sakshi
Sakshi News home page

నిరసనకారులతో ‘నారా’ చర్చలు సఫలం

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

సాక్షి,బళ్లారి: మహానగర పాలికె ఏఈఈ వీరేష్‌పై కార్పొరేటర్‌ కుబేర దాడి చేయడాన్ని నిరసిస్తూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నారా సూర్యనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పాలికె సిబ్బందితో చర్చించారు. మహానగర పాలికె ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోవిందబాబుతో పాటు ఆందోళనలో పాల్గొన్న ప్రముఖులతో నేరుగా మాట్లాడారు. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తామని, ఽఅందరి అభిప్రాయాలను తీసుకుని కచ్చితంగా న్యాయం చేస్తానని, తన మాటపై విశ్వాసం ఉంచాలని, ఇకపై ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పాలికె ఉద్యోగులు ఆందోళనలకు స్వస్తి పలికి యథావిధిగా విధులకు హాజరయ్యారు. ఆదివారం రాత్రి మేయర్‌ గాదెప్ప కూడా పాలికె సిబ్బందితో చర్చించారు.

కేసులు వెనక్కి తీసుకునేలా రాజీ

ఇరు వర్గాలు కేసులు వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తామని, క్షమాపణలు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాలికె సిబ్బంది, అధికారులు ధర్నాను విరమించారు.

ఆందోళనను విరమించిన పాలికె సిబ్బంది

యథావిధిగా విధులకు అధికారుల హాజరు

న్యాయం చేస్తానని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి భరోసా

Advertisement
 
Advertisement
Advertisement