సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ఒక్క మంచి పని చేసిందా అని బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం దావణగెరె ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ.టీ రవి నేతృత్వంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలపై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. సిద్దరాయమ్య ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోవడంతో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ముడా, వాల్మీకీ నిగమ మండళి, లిక్కర్ స్కామ్స్ జరిగాయాని తెలిపారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు పడుతున్న బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.


