బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ పట్టణంలోని శ్రీ ధర్మరాయస్వామి ఆలయంలో ద్రౌపదమ్మ దేవి హసి కరగ ఉత్సవం శుక్రవారం అర్ధరాత్రి నుంచి వేలాదిమంది భక్తుల మధ్య వైభవంగా జరిగింది. సంతేమాలలోని ధర్మరాయస్వామి ఆలయం నుంచి పూజారి రమేష్ కరగనెత్తుకుని శనివారం తెల్లవారుజామున 3:20 గంటలకు బయటకు వచ్చారు. నగర వీధుల గుండా కరగధారి ఆర్భాటం కొనసాగింది. కరగధారి నృత్యాలు చేస్తుండగా ఆనందం పట్టలేక భక్తులు కూడా చిందులేశారు.
భక్తులకు చీపురు దెబ్బలు
ఈ సందర్భంగా ధర్మరాయస్వామి ఆలయం పక్కన డబ్బులిచ్చి చీపుర్లతో దెబ్బలు తిని, అభిమన్యు పద్మవ్యూహం కోటను ఛేదించే కోట పోరాటం జరిగింది. పలువురు భక్తులు డబ్బులు ఇచ్చి చీపురుతో దెబ్బలు తిన్నారు. దీని వల్ల అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.


