దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో వాహనాలకు ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్ దొరకడం లేదు. బెంగళూరు, మంగళూరుతో సహా అన్ని ప్రాంతాల్లో గ్యాస్ స్టేషన్ల ముందు ఆటోడ్రైవర్లు వందలాదిగా క్యూ కడుతున్నారు. తెల్లవారుజామున నిలబడితే సాయంత్రం తమ వంతు వస్తున్నట్లు కొందరు డ్రైవర్లు వాపోయారు. సంపాదన లేక కుటుంబాలు గడవడం లేదని వాపోయారు. అనేక గ్యాస్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఎప్పుడు స్టాక్ వస్తుందో తెలియడం లేదని ఓనర్లు, ఆటోడ్రైవర్లు దిగులుగా ఉన్నారు. సీఎన్‌జీ కార్లు చాలావరకూ బయటకు రావడం లేదు.
వాటాల్ నిరసన
గ్యాస్ కొరత తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని కన్నడభాషా ఉద్యమ నేత వాటాల్ నాగరాజు రామనగరలో అనుచరులతో కలిసి ధర్నా చేపట్టారు. గ్యాస్ సిలిండర్‌ల పంపిణీలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనట్లు ఆరోపించారు. హోటళ్లు మూతబడుతున్నాయని, అనేకమంది ఉపాధి కోల్పోయారన్నారు. ఆటో డ్రైవర్లు వీధినపడ్డారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు.
శనివారం చిక్కమగళూరులో నిలిచిపోయిన ఆటోలు
కొనసాగుతున్న ఇబ్బందులు


