కారుపై పడ్డ బస్సు | - | Sakshi
Sakshi News home page

కారుపై పడ్డ బస్సు

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

దొడ్డబళ్లాపురం: కొడగు జిల్లా మడికెరి తాలూకా మరగోడు గ్రామం వద్ద టూరిస్ట్‌ బస్సు ఒకటి కారు మీద పడింది. అయితే ఆశ్చర్యకరంగా కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నారు. బస్సు డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడం వల్లే బస్సు కారుపైకి పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

డివైడర్‌కు కారు ఢీ, బాలిక మృతి

దొడ్డబళ్లాపురం: కారు ప్రమాదంలో బాలిక మృతిచెందిన సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా కొత్తనూరు వద్ద జరిగింది. కలబుర్గి జిల్లాకు చెందిన రాజేంద్ర, భాగ్యమ్మ దంపతుల కుమార్తె అంకిత (9), వీరు హొసకోటలో నివసిస్తున్నారు. భాగ్యమ్మ కుమార్తెతో కలిసి బంధువు మహేశ్‌తో కారులో వెళ్తుండగా కొత్తనూరు వద్ద ఓవర్‌ టేక్‌ చేస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అంకిత చనిపోగా, మిగతావారు గాయాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement