సైబర్‌ నేరగాళ్ల పంజా | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల పంజా

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

బెంగళూరుపై

బనశంకరి: సిలికాన్‌ సిటీగా ఖ్యాతి గడించిన బెంగళూరులోనే సైబర్‌ నేరాలు ఎక్కువగా జరగడం గమనార్హం. నగరంలో ఐటీ బీటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు, రిటైరైనవారు, యువత.. ఇలా అన్ని వర్గాలూ సైబర్‌ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నవారే. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు.

ఏటా 1800 కేసులు

బెంగళూరులో గత మూడేళ్ల 9 నెలలు.. అంటే 45 నెలల్లో 53,252 సైబర్‌ నేరాల కేసులు నమోదుకాగా రూ.4,341 కోట్లను మోసగాళ్లు దోచేశారు. 2022 నుంచి 2025 నవంబరు 30 వరకు సీసీబీ, సైబర్‌ క్రైంతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్లలో ఏటా 1,500 నుంచి 1,800 మంది తాము వంచనకు గురయ్యామంటూ ఫిర్యాదులు చేశారు. ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, టెక్కీలు, ప్రభుత్వ ఉద్యోగులు బాధితుల్లో ఉన్నారు.

రికవరీ 10 శాతం కంటే తక్కువే

ప్రతి ఏడాది సైబర్‌ వంచకులు దోచేస్తున్న కోట్లాది రూపాయల్లో రికవరీ పరిమాణం 10 శాతం కంటే తక్కువగా ఉంది. నమోదైన 90 శాతం కేసుల్లో మోసగాళ్ల ఆచూకీ దొరకడం లేదు. బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి చూస్తే ఎక్కడో విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో నేరగాళ్లను పట్టుకోవడం కష్టమని ఓ సైబర్‌ క్రైం అధికారి తెలిపారు.

● 2022లో 9,902 సైబర్‌ వంచన కేసులు నమోదు కాగా, బాధితులు రూ.281 కోట్లు కోల్పోయారు. రూ.100 కోట్లను సైబర్‌ పోలీసులు ఫ్రీజ్‌ చేసి రూ.51 కోట్లు రికవరీ చేశారు.

● 2023లో 17,697 కేసులు నమోదు కాగా రూ.680 కోట్లు సైబర్‌ నేరగాళ్లు పాలైంది. రూ.321 కోట్లు ఫ్రీజ్‌ చేయగా రూ.90 కోట్లు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. బాధితులకు రూ.88 కోట్లు అప్పగించారు.

● 2024లో 17,692 మంది మోసపోతే, రూ.1,990 కోట్లను దుండగులు కొల్లగొట్టారు. పోలీసులు దర్యాప్తు చేసి రూ.917 కోట్లు ఫ్రీజ్‌ చేయగా, రూ.170 కోట్లు రికవరీ అయ్యాయి. రూ.156 కోట్లను ఫిర్యాదుదారులకు అప్పగించారు.

● 2025లో సెప్టెంబరు 30 వరకు 7,961 మంది మోసపోయారు. రూ.1,385 కోట్లు పోగొట్టుకున్నారు. ఇందులో రూ.146 కోట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేయగా, రూ.49 కోట్లు రికవరీ చేసి, రూ.39 కోట్లను ఫిర్యాదుదారులకు అప్పగించారు.

మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహిస్తే, ఠాణాకు వెళ్లాల్సిన అవసరం ఉండదు

45 నెలల్లో రూ.4,341 కోట్లు దోపిడీ

రూ.360 కోట్లు మాత్రమే రికవరీ..

బాధితులకు రూ.334 కోట్లు వాపస్‌

తీవ్రంగా నష్టపోతున్న రాజధానివాసులు

ఎక్కడో కూర్చున్న నేరగాడు..

బెంగళూరులో ఎవరికో కాల్‌ చేస్తాడు, కొన్ని క్షణాల్లోనే మాయచేసి లక్షలాది రూపాయలను కాజేస్తాడు. ఇది నిత్యం జరుగుతున్న తంతే. డిజిటల్‌ విజ్ఞానం ఎంత విస్తరిస్తుంటే మోసాలు కూడా

అంతగా వ్యాపిస్తున్నాయి. ఇదే మాదిరి అని కాకుండా ఊహించని రూపాల్లో సైబర్‌ నేరగాళ్లు మాయ చేస్తున్నారు. మోసపోయి ఫిర్యాదు చేయడం కంటే,

అటువంటి ఎరలో పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement