అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

హొసపేటె: హంపీ జాతర సందర్భంగా కడ్డిరాంపుర హంపీకి చెందిన శ్రీ మారిదేవ సంగీత కులసుకృతి కళా బృందం ఆధ్వర్యంలో గురువారం రాత్రి విరుపాక్షేశ్వర ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామిజీ మాట్లాడుతూ.. సంగీతం అనేది మనల్ని భక్తి మార్గంలో నడిపించే ఒక సాధనమని తెలిపారు. యువత విదేశీ సంస్కృతికి ఆకర్షితులై మోసపోకూడదని సూచించారు. మన స్వదేశీ కళలను ఆదరించాలని పిలుపునిచ్చారు. హిందుస్తానీ సంగీతం, లలిత సంగీతం, భక్తి గీతాలు, గంగావతి వైష్ణవి బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కళాకారుల సమూనా నృత్యాలు, వివిధ కళాకారులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హంపీ గ్రామ పంచాయతీ అబివృద్ధి అధికారి గంగాధర్‌, హంపీ గ్రామ పంచాయతీ మాజీ సభ్యులు కే.గోపాల్‌, కే.షణ్ముకగౌడ, కళా బృంద వ్యవస్థాపక అధ్యక్షులు వామదేవ, విశ్వనాథ్‌ హిట్నాల్‌, హెచ్‌కే తరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement