బనశంకరి: రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న సైబర్ నేరాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య పోలీసులకు పిలుపునిచ్చారు. గురువారం కోరమంగల పరేడ్ మైదానంలో పోలీస్ పతాకం దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కర్ణాటకలో సైబర్ నేరాలతో పాటు ఇతరత్రా నేరాలు జాతీయ సరాసరి కంటే పెరిగాయని, వీటిని కట్టుదిట్టంగా నియంత్రించాలని సీఎం తెలిపారు. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ అక్కడి పోలీసు అధికారులకు తెలియకుండా నేరాలు, చెడు వ్యవహారాలు జరగడం సాధ్యం కాదని అన్నారు. మహిళలు, పిల్లలు, నిరాశ్రయుల రక్షణే తమ ప్రభుత్వ ఆశయమని, అందుకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, శాంతిభద్రతలకు నేరుగా సంబంధం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ పాటుపడాలని సూచించారు. హోంమంత్రి పరమేశ్వర్, డీజీపీ ఎంఏ సలీం పాల్గొన్నారు.
పోలీసులకు సీఎం సూచన


