దొడ్డబళ్లాపురం: లెక్చరర్‌తో అక్రమ సంబంధం ఉందని కొందరు దుష్ప్రచారం చేయడంతో తీవ్ర ఆవేదనకు లోనైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఆయుర్వేద కాలేజీలో బీఏఎంఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (22) డెత్‌నోట్ రాసి ఉరివేసుకుంది.
కాలేజీ లెక్చరర్ డా.రాజుతో ఆమెకు అనైతిక సంబంధం ఉందని కొందరు పోకిరీలు దుష్ప్రచారం చేయసాగారు. ఇది రాజు భార్యకు తెలిసి కాలేజీకి వచ్చి విద్యార్థినితో గొడవ పడి పెద్ద రచ్చ చేసింది. దీంతో పరువు పోయిందని బాధపడిన విద్యార్థిని ఇంటికెళ్లి ప్రాణాలు తీసుకుంది.
డెత్‌నోట్‌లో..
తాను ఎటువంటి తప్పు చేయలేదని, తన చావుకి అనూష, రక్ష, చినయి, సాగర్‌లే కారణమని డెత్‌నెట్‌లో పేర్కొంది. వీరే లిఖితపై దుష్ప్రచారం చేసిన విద్యార్థులని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


