బనశంకరి: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వల్ల కమర్షియల్ సిలిండర్లకు కొరత ఏర్పడింది, కర్ణాటకకు నిత్యం 10 వేల సిలిండర్లు సరఫరా చేయడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందని, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్.మునియప్ప తెలిపారు. గ్యాస్ సమస్యపై సోమవారం తమ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత వారం వెయ్యి సిలిండర్లను హోటల్స్ కు అందించామని ప్రస్తుతం హోటల్, డాబా, హాస్టళ్లు, ఇందిరా క్యాంటీన్, ఆసుపత్రులకు సరఫరా చేయడానికి ప్రతి నిత్యం 10 వేల కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపారు.
నమోదు తప్పనిసరి
కమర్షియల్ వినియోగదారులు వచ్చే శనివారంలోగా గ్యాస్ కంపెనీల వద్ద తప్పనిసరిగా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోకపోతే వాణిజ్యానికి వినియోగించే సిలిండర్లు లభించవని మంత్రి తెలిపారు. ఎవరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనే సమాచారం ఉండాలన్నారు. హోటల్ యజమానులకు కరెంటు బిల్లులను తగ్గించే విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యం రాష్ట్రానికి 10 వేల సిలిండర్లు అందిస్తుందని మంత్రి తెలిపారు. అదనంగా 20 శాతం సిలిండర్లు ఇస్తామని తెలిపిందన్నారు.
కేంద్రం నుంచి రోజూ 10 వేల సిలిండర్లు
పౌరసరఫరాల మంత్రి మునియప్ప


