డివైడర్‌కు ప్రైవేటు బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌కు ప్రైవేటు బస్సు ఢీ

Mar 24 2026 7:06 AM | Updated on Mar 24 2026 7:06 AM

నలుగురు దుర్మరణం

మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదం

దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేపై చన్నపట్టణ తాలూకా పుట్టప్పనదొడ్డి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కేరళకు చెందిన మహ్మద్‌ ఫరాన్‌ (22), రఫీజ్‌ (45), బెంగళూరుకు చెందిన రశీద్‌ (45), షాకీర్‌ (27) అనేవారు మరణించారు. కేరళలోని పీకే ట్రావెల్స్‌కి చెందిన బస్సు కోజికోడ్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా వేగం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఈ నలుగురు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడమే కారణమని అనుమానాలున్నాయి. చెన్నపట్టణ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు.

కాబోయే భార్య హత్య..

నిందితుడు అరెస్టు

యశవంతపుర: కాబోయే భార్య (18)ని అనుమానంతో అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితున్ని బెంగళూరు డీజే హళ్లి పోలీసులు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితుడు శబీల్‌ (20)ను బెంగళూరుకు తీసుకొచ్చారు. ఈ నెల 17న డీజే హళ్లిలోని చక్కెర మండీ వద్ద పాడుబడిన ఇంటిలోకి యువతిని తీసుకెళ్లిన నిందితుడు ఆమెను కత్తితో 20 సార్లకు పైగా పొడిచి చంపి పరారయ్యాడు. వారిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థమైంది, బక్రీద్‌ పండుగ తరువాత పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కానీ ఆమైపె అనుమానం పెంచుకున్న శబీల్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్సాహంగా పికిల్‌బాల్‌ టోర్నీ

బొమ్మనహళ్ళి: బెంగళూరు నగరం బొమ్మనహళ్ళి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో పికిల్‌బాల్‌ టోర్నీ సందడి నెలకొంది. దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి క్రియేటర్లను ఒకచోట చేర్చింది. ఇందులో యువతతోపాటు చిన్నరులు సైతం పాల్గొని పికిల్‌బాల్‌ ఆడారు. అలాగే లైఫ్‌ స్టైల్‌, ఫిట్‌నెస్‌, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్‌, సిటీ గైడ్‌ రంగాలకు సంబంధించి కార్యక్రమాలు జరిగాయి. రోజంతా ఉత్సాహంగా కార్యకలాపాలు కొనసాగాయి.

బంధువు దాష్టీకం,

తల్లయిన బాలిక

మైసూరు: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలోని ఒక గ్రామంలో కడుపునొప్పితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఆడబిడ్డను ప్రసవించింది. ఆమెను గర్భవతిని చేశాడన్న ఆరోపణపై బంధువైన సురేష్‌ (46)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసి జైలుకు పంపారు. బాలిక కాన్పు గురించి గుండ్లపేట ఆసుపత్రి సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రేమపేరుతో బాలికను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని, గర్భం దాల్చిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా మౌనంగా ఉందని తెలిసింది.

రామదండు పాదయాత్ర

చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార యోగినారేయణస్వామి మఠంలో తాతయ్య 300 జయంతి సందర్భంగా కోలారు, చిక్కబళ్లాపుర భక్తుల ఆధ్వర్యంలో శ్రీరామ దండు సంకీర్తన పాదయాత్ర ఘనంగా జరిగింది. కోటకల్‌ శింగరె లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయంలో పాదయాత్రను ప్రారంభించి కై వారం వరకూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ నడిచి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement