రాయచూరు రూరల్: సన్మానాలు ముఖ్యం కాదు.. సాహ్యిత సేవలు అనన్యమని కవయిత్రి హెచ్.జి.లక్ష్మి తెలిపారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో బరగూరు రామచంద్రప్ప దత్తి అవార్డు అందుకుని ప్రసంగించారు. సాహిత్యం రాసే ముందు భావితరాల వారికి ఉపయెగపడే విధంగా చూడాలన్నారు. కవులకు హెచ్.జి.రాధా దేవి మార్గదర్శి అని.. కవితలు సమాజానికి పనికొచ్చేలా ఉండాలని తెలిపారు. యువకుల మనస్సులను దోచే విధంగా పుస్తకాలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో రంగణ్ణ పాటిల్, బాబు బండారీ గల్, భీమన గౌడ, లక్ష్మీదేవి శాస్త్రి, విజయ రాజేంద్ర, దానమ్మ, వీర హనుమాన్, రావుత్ రావు, దండెప్ప బిరదార్ పాల్గొన్నారు.
బేగం తలాబ్
వాటర్ పార్కు ప్రారంభం
రాయచూరు రూరల్: వేసవి కాలంలో పిల్లలు, యువత సేద తీరేందుకు విజయపుర (బీజాపూర్)లోని బేగం తలాబ్ చెరువు సమీపంలో కొత్తగా ఒక వాటర్ పార్క్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. శనివారం సాయంత్రం విజయపుర బేగం తలాబ్ చెరువు వాటర్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తోడు మూడు నెలల పాటు వేసవిలో కాలక్షేపం కోసం బేగం తలాబ్ వాటర్ పార్కును ప్రారంభించడం జరిగిందన్నారు. వివిధ రకాలైన జల క్రీడలు ఆడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
31న మహిళా దినోత్సవం
రాయచూరు రూరల్: ఈనెల 31న ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ శావంత గేర పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 31న పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సావిత్రి బాయి పూలే సంఘం ఆద్వర్యంలో జరిగే కార్యక్రమంలో మహిళలను సన్మానించడం జరుగుతుందన్నారు. వారం రోజుల పాటు మహిళలకు క్రీడలు, సాంస్క్రతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రత్న, చాయదేవి, జయశ్రీ, యంకప్ప, సంతోష్, నీలమ్మ, రాజ శేఖర్, సరసుబాయి పాల్గొన్నారు.
జై భజరంగ భళి
రాయచూరు రూరల్: నగరంలోని జవహర్ నగరలో భజరంగి యువసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా భారీ భజరంగ బళి (ఆంజనేయుడు) విగ్రహాన్ని ఊరేగించారు. వివిధ కూడళ్లలో ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులు పూజలు చేశారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు అందరు సిద్ధం కావాలని భజరంగి బళి యువసేన నాయకులు పిలుపునిచ్చారు.
పుణ్యక్షేత్రాల
అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని పవిత్ర ధర్మ స్థలాలు, దేవాలయాల, యాత్రికుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించిందని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, వారణాసి, తుళజా భవాని యాత్రికుల భవన నిర్మాణాలు, మంత్రాలయంలో నూతన కర్ణాటక భవన నిర్మాణాలకు రాష్ట్ర ముుఖ్యమంత్రి సిద్దరామయ్య, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామలింగా రెడ్డి సహకారంతో పనులకు నిధులు విడదుల చేశారన్నారు. మహ వైష్ణవి దేవి ఆలయ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ప్రభుత్వం రూ.5 వేల ప్రోత్సాహక ధనం ఇస్తుందని వివరించారు.


