వార్డుల్లో కనీస వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

వార్డుల్లో కనీస వసతులు కల్పించాలి

Mar 23 2026 8:52 AM | Updated on Mar 23 2026 8:52 AM

సాక్షి, బళ్లారి: తమ వార్డు పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డికి మహిళలు విన్నవించారు. ఆదివారం నగరంలోని 18వ వార్డు పరిధిలో ఉన్న వివిధ కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా కాలనీలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్నారు. వార్డులో డ్రైనేజీ, రోడ్లు, రాజాకాలువ అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య తాండవిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేసవిలో మంచి నీటి సమస్య తలెత్తకుండా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. నీటి సమస్య తలెత్తితే తమ దృషికి తీసుకురావాలని సూచించారు. ప్రతి కాలనీల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ వసతి, మంచినీటి సమస్య తీర్చేందుకు తగిన చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ నందీష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గోవింద్‌, గుంతకల్లు సురేష్‌, కట్టమనే నాగేంద్ర, బసిలహళ్లి మంజు తదితరులు పాల్గొన్నారు.

వైభవం..

పుష్ప పల్లకీ ఉత్సవం

శ్రీనివాసపురం: పట్టణంలోని కాళికా కమటేశ్వరి అమ్మవారి పుష్ప పల్లకీ ఉత్సవాన్ని శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు చేశారు. రాత్రికి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి పట్టణంలోని వీధుల్లో ఊరేగించారు. దేవాలయ ప్రధాన అర్చకులు మోహనాచారి, రవీంద్రాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement