వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం

Mar 22 2026 2:01 AM | Updated on Mar 22 2026 2:01 AM

రాయచూరు రూరల్‌: నారాయణ పుర కుడి కాలువలోకి జారి పడి ఓ యువకుడు నీటి పాలైన ఘటన రాయచూరు జిల్లా బుద్దిన్నిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఉగాది కరి పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని అరకెర తాలూకా బుద్దిన్ని నివాసి స్నానం కోసం కాలువ వద్దకు వెళ్లిన గంగాధర(20) ఈత రాక పోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నాగోలి వద్ద శవం లభించినట్లు పోలీసులు తెలిపారు. గబ్బూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చెరువులో పడి ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని మాన్వి తాలూకాలో జరిగింది. గోవినదొడ్డి గోవిందరాజ్‌(22) అనే యువకుడు ఈత రాక పోవడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

కాలువలోకి జారి పడి ఓ యువకుడు

చెరువులో పడి మరో యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement