దొడ్డబళ్లాపురం: తల్లితో కలిసి దేవాలయానికి వెళ్తున్న నాలుగేళ్ల పాపను లారీ చిదిమేసిన దుర్ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హనుమంతేగౌడన పాళ్యలో జరిగింది. నిశిక (4) మృతురాలు. తల్లితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ నిశికను ఢీకొంది. తీవ్రగాయాలైన పాప అక్కడే మరణించింది. కళ్లముందే బిడ్డ దూరం కావడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించింది. లారీ డ్రైవర్‌పై మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్సాహంగా చేపల వేట
యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా బీళూరు గ్రామంలో చెరువులో చేపల వేట జరిగింది. ఏటా చేపలు పట్టే పోటీలు జరుగుతాయి. వలలు వాడకుండా చేతులతోనే పట్టాలి. వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఒక్కొక్కరు రూ.800 రుసుము చెల్లించాలి, ఈ డబ్బును కల్లేశ్వర దేవస్థానం జీర్ణోద్ధరణకు ఉపయోగిస్తామని గ్రామపెద్దలు తెలిపారు. కొందరికి మాత్రమే చేపలు దొరికాయి.


