బనశంకరి: బెంగళూరు ఎంజీ రోడ్డులో శనివారం వేకువజామున విలాసవంతమైన తెల్ల రంగు లంబోర్గిని కారులో పోకిరీలు విపరీతమైన వేగంతో డ్రిఫ్టింగ్ విన్యాసాలు చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో లంబోర్గిని కారులో దూసుకొచ్చి వేగంగా మలుపులు తిప్పారు, పెద్ద శబ్ధంతో పాటు పొగలు రేగాయి. కొందరు దీనిని మొబైల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సమాచారం ఆధారంగా కబ్బన్ పార్కు ట్రాఫిక్ సీసీ కెమెరాలను పరిశీలించి కేఏ–05 ఎన్‌ఆర్ 0009 నంబరు లంబోర్గిని కారుగా గుర్తించారు. కారు యజమాని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు ఆర్‌సీని రద్దుచేయాలని ఆర్‌టీఓకు లేఖ రాశారు.


