డిజిటల్ అరెస్టు పేరిట ఒక వృద్ధుడిని మోసం చేసి లక్షలాది రూపాయలను సైబర్ కేటుగాళ్లు దండుకున్నారు. ఈ ఘటనపై వైట్‌ఫీల్డ్ సైబర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వైట్‌ఫీల్డ్ ఈసీసీ లక్ష్మి ఎన్‌క్లేవ్ అపార్టుమెంట్‌లో ఉండే 64 ఏళ్ల వృద్ధుడు రూ.16.60 లక్షలను పోగొట్టుకున్నాడు. ముంబై పోలీసుల పేరిట తనను తాను పరిచయం చేసుకున్న నిందితుడు, మీ బ్యాంకు ఖాతా నుంచి ఉగ్రవాద సంస్థలకు డబ్బులు తరలించారని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు బదిలీ చేయాలని బెదిరించి ఏకంగా రూ.16.60 లక్షలను దోచుకున్నాడు.


