ఉపాధి కోసం వచ్చి పరలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసం వచ్చి పరలోకాలకు..

Mar 20 2026 7:59 AM | Updated on Mar 20 2026 7:59 AM

హుబ్లీ: స్థానిక దేశ్‌పాండే నగర్‌లో ఓ అంగడి ఇంటీరియల్‌ డెకరేషన్‌ కోసం వచ్చిన కార్మికుడు చనిపోయాడు. వివరాలు.. రామనగర్‌ జిల్లా మాగడి తాలూకా జమాల్‌ సాబ్‌ పాల్య నివాసులైన అంజాద్‌ పాషా, హైదర్‌, జబి, జాఫర్‌ అనే కార్మికులు దుకాణాల్లో ఎల్‌ఈడీ వాల్‌ తదితర పని చేయడంలో నేర్పరులు. స్థానిక దేశ్‌పాండే నగర్‌లో డ్రైఫ్రూట్‌ అంగడి ప్రారంభించే క్రమంలో ఇంటీరియల్‌ వర్క్‌ కోసం లారీ డ్రైవర్‌ అలీన్‌తో పాటు ఐదుగురు వచ్చారు. ఈనెల 16న రజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్న ఈ నలుగురు రాత్రి భోజనం చేసి అదే కట్టడంలో పడుకున్నారు. ఓ రాత్రి వేళ విద్యుత్‌ సరఫరా ఆగి పోవడంతో ఆ గదిలో ఉన్న రసాయనాల ప్రభావంతో సరైన ఆక్సిజన్‌ అందక వీరు అస్వస్థతకు గురయ్యారు. 17న ఉదయం ఎంత సేపటికి వీరు బయటకు రాక పోవడంతో బయట లారీలో పడుకున్న డ్రైవర్‌ షెట్టర్‌ తెరచి చూశాడు. నలుగురు మతి స్థిమితం కోల్పోయి కనిపించారు. తక్షణమే అంగడి యజమానికి సమాచారం ఇచ్చాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చావు బతుకుల మధ్య పోరాడిన అంజాద్‌ పాషా (26) గురువారం కన్నుమూశాడు. మిగిలిన వారు జాఫర్‌, జబి, హైదర్‌ చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement