యూత్ కాంగ్రెస్ ధర్నా
రాయచూరు రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత ఏఐ ఇంప్యాక్ట్ శృంగసభ–2026 జరుగుతున్న సమయంలో అరెస్టు చేసిన యువ కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ యువ మోర్చా డిమాండ్ చేసింది. శనివారం టిప్పు సుల్తాన్ సర్కిల్ వద్ద చేపట్టిన ధర్నాలో అధ్యక్షుడు మర్రిస్వామి మాట్లాడారు. ఏఐ ఇంప్యాక్ట్ శృంగసభను చూడటానికి వెళ్లిన కార్యకర్తలను దేశ ప్రతిష్టను మంటగలిపారని ఆరోపిస్తూ, అసభ్య పదజాలంతో దూషించారంటూ అరెస్ట్ చేసిన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. ఆందోళనలో నిర్మల, ప్రతిభారెడ్డి, జ్యోతి, మధు కుమార్, ఫైసల్ ఖాన్, అజ్జు, కిశోర్, శివు, సూరి, సాగర్, ప్రతాప్, రఘు, ఇస్మాయిల్, శహబాజ్‌లున్నారు.
రిజర్వేషన్ ప్రకటించే వరకు నియామకాలు తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం తగదని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ కార్యాధ్యక్షుడు మహేంద్ర మిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగమోహన్‌దాస్ నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపు జరిగే వరకు ఎలాంటిి ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలోకి 41వ నిబంధన ప్రకారం డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు, పీజీ విద్యార్థులకు రూ.25 వేలు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.
సావర్కర్, మోదీలకు
అవమానంపై కేసు
హుబ్లీ: వీర సావర్కర్, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అందులో వీర సావర్కర్, మోదీలను అవమానించే రీతిలో దృశ్యాలను పొందుపరిచి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పరువుకు భంగం కలిగించారు. దీంతో సమాజంలో అశాంతి, ద్వేషం వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరుతూ అరవింద నగర బీజేపీ కార్యాలయం చిరునామాతో ఉపాధ్యాయుడు మహేష్ ఎన్.తపేలా నగర సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరో ఘటనలో తనను ప్రేమించలేదన్న అక్కసుతో సోదరి, కోడలు ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని గదగ్ జిల్లాకు చెందిన మల్లాడ అనే వ్యక్తి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళా అభ్యుదయ
రైతుకు సన్మానం
హుబ్లీ: మహిళా ప్రగతిశీల రైతుగా ఎన్నో అవార్డులు దక్కించుకున్న గదగ్ జిల్లా ముళగుందకు చెందిన రైతు మహిళ మంగళా కిరణ్ నీలగుందను ముళగుంద ప్రాథమిక బాలికల పాఠశాలలో ఘనంగా సన్మానించారు. అనంతరం మంగళా కిరణ్ మాట్లాడుతూ వ్యవసాయ పట్టా అందుకున్న తనకు భర్త, తండ్రి, గురువుల మార్గదర్శనంతోనే తాను ఈ స్థాయికి చేరానన్నారు. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డులు, రివార్డులకు వారే కారణం అన్నారు. కాగా మహిళల ఆర్థిక స్వావలంబన సాధన కోసం వివిధ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా కుట్టుమిషన్, అల్లికలు, వైవిధ్యమైన బ్యాగుల తయారీ తదితరాలను చేపట్టినట్లు ఆమె తెలిపారు. పాఠశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ధర్నా
యూత్ కాంగ్రెస్ ధర్నా


