జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

జేఈఈ

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

బళ్లారిఅర్బన్‌: జేఈఈ మెయిన్స్‌–2026 పరీక్షలో బళ్లారికి చెందిన న్యూ శ్రీచైతన్య పీయూ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి కాలేజీకి కీర్తి తెచ్చారు. పరీక్షల్లో డీ.రోహిత్‌కుమార్‌ 99.71 పర్సెంటైల్‌ సాధించి కాలేజీలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇశాంత్‌ రాయ్‌(98.04), హెచ్‌.లిఖిత్‌ (96.92), ఎస్‌.వివేక్‌ (95.14), అరుణ్‌ ఆర్‌ఎస్‌జీ (92.86), త్రిషా (92.75), ప్రజ్వల్‌ (92.46), విజయకుమార్‌ మైనళ్లి (92.00), సాయి హర్షిక కేఎస్‌ (91.90), బీ.మధు సాయి చరణ్‌ (91.27), శరణ బసవ (90.37), శ్రీహిత 90.06 పర్సెంటైల్‌ సాధించి ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల సాధనపై కాలేజీ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రులు సహకారంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి

తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆందోళన

డ్రైవర్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌

సాక్షి,బళ్లారి: ఇటీవల ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనను మరవక ముందే అదే తరహాలో మరో ఘటన జరిగింది. యాదగిరి జిల్లా గురుమఠకల్‌ తాలూకా గాజర్‌కోట విజ్డం పాఠశాలలో చదువుతున్న పునీత్‌(4) అనే చిన్నారి బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సు డ్రైవర్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పి శాంతింపజేశారు. ఘటనపై గురుమఠకల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇందిరా క్యాంటీన్‌లో తనిఖీ

హొసపేటె: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఇందిరా క్యాంటీన్‌ను మంత్రి రహీంఖాన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో వండిన వంటను రుచి చూశారు. అదే విధంగా అక్కడ తింటున్న వారిని వండిన వంట గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో వంటలను నాణ్యతగా వండాలని సూచించారు. ఎమ్మెల్యే గవియప్ప, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, పట్టణాభివృద్ధి ప్రాజెక్టు కోశాధికారి మనోహర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శివకుమార్‌ ఎర్రగుడి తదితరులు పాల్గొన్నారు.

ఖైదీలు స్వయం ఉపాధి సాధించాలి

రాయచూరు రూరల్‌: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మానసికంగా ప్రవర్థమానులై సమాజంలో శాంతియుతంగా కుటుంబ జీవితం గడపడానికి స్వయం ఉపాధి సాధనకు ముందుండాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖైదీలనుద్దేశించి మాట్లాడారు. శిక్షలు అనుభవించే ఖైదీలు భవిష్యత్తులో జీవితాలను మార్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఖైదీలకు ఆహారం, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు జైలు అధికారులు తీసుకున్న చొరవను అభినందించారు. ఖైదీలు తయారు చేసిన పదార్థాలపై ఆరా తీశారు. అధికారులు హుడేద్‌, సదానంద, సత్యనారాయణ, మారుతేష్‌, బసణ్ణ, జిల్లా జైలర్‌ అనిత హిరేమనిలున్నారు.

అవయవదానానికి

పేర్ల నమోదు

బళ్లారి రూరల్‌ : కురుగోడులో జరిగిన ఉత్సవంలో జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తుప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచినట్లు ఆ శాఽఖాధికారులు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యానికి పాటించాల్సిన సూచనలు, వస్తువులను ప్రదర్శించారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవానికి వచ్చిన సందర్శకులు రక్తపోటు, మధుమేహం, అంటు వ్యాధుల నియంత్రణ వివరాలు తెలుసుకున్నారు. శిబిరంలో వివిధ పరీక్షలు చేయించుకున్నారు. అవయవదానంపై జాగృతిలో భాగంగా సుమారు 100 మంది అంగీకార పత్రాలను తీసుకున్నారు. డీహెఓ డాక్టర్‌ యల్లా రమేష్‌బాబు వీక్షించారు. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్‌ జీ.మంజునాథ, వైద్యాధికారి డాక్టర్‌ లక్మణ్‌ నాయక్‌, ఇన్‌చార్జ్‌ జిల్లా ఆరోగ్య విద్యాధికారిణి ఖుర్శిద్‌ బేగం, తాలూకా క్షేత్ర శిక్షణాధికారి మహ్మద్‌ రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ  1
1/1

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement