లౌకికవాదానికి ప్రతీక కన్నడ | - | Sakshi
Sakshi News home page

లౌకికవాదానికి ప్రతీక కన్నడ

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

లౌకికవాదానికి ప్రతీక కన్నడ

లౌకికవాదానికి ప్రతీక కన్నడ

హొసపేటె: కన్నడ కేవలం ఒక భాష కాదు. అన్ని కులాలు, మతాల రచయితలు ఈ భాషను నిర్మించి, పెంచి పోషించారు. కన్నడ అన్ని కులాలు, మతాలను అధిగమించి, సామరస్యం, సమానత్వం, లౌకికవాదానికి ప్రతీక అని సీనియర్‌ పండితుడు, సాంస్కృతిక ఆలోచనాపరుడు నాడోజ బరగూరు రామచంద్రప్ప అన్నారు. కన్నడ విశ్వవిద్యాలయం నుడిహబ్బ–34 సందర్భంగా మంటప ఆడిటోరియంలో ప్రసార విభాగం నిర్వహించిన 42 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడను కేంద్రంగా, పరిశోధనను జీవనాడిగా కలిగి ఉన్న కన్నడ విశ్వవిద్యాలయానికి తగినన్ని నిధులు అందడం లేదు. నిధుల ద్వారా మరింత మద్దతు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement