టెన్త్‌లో మంచి ఫలితాలు సాధించాలి
రాయచూరు రూరల్ : మార్చి నెలలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మాన్వి తహసీల్దార్ భీమరావ్ సూచించారు. బుధవారం జిల్లాలోని మాన్వి తాలూకాలో వివిధ గ్రామాల్లో సంచరించి ఇంటింటికెళ్లి విద్యార్థులను కలిసి విజన్– 625ను లక్ష్యంగా చేసుకొని మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులతో చర్చించి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాగా చదవాలని సూచించారు. పరీక్షలకు కేవలం 30 రోజుల గడువు మాత్రమే ఉండడంతో బాగా చదవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి విద్యాభ్యాసానికి అవకాశాలు కల్పించాలని కోరారు.


