తప్పుడు కేసులను తొలగించండి
రాయచూరు రూరల్ : జిల్లాలో జేడీఎస్ నేతలపై బనాయించిన తప్పుడు కేసులను తొలగించాలని జేడీఎస్ పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు విరుపాక్షి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు జేడీఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వాటిని రద్దు చేయాలని కోరుతూ ఎస్పీ అరుణాంగ్షు గిరికి వినతిపత్రం సమర్పిం చారు. మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్, మహంతేష్ పాటిల్, శివశంకర్, రాజు, నరసప్ప, రామనగౌడ, నరసింహ నాయక్, తిమ్మారెడ్డిలున్నారు.


