భోగ, యోగ నందీశ్వర రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

భోగ, యోగ నందీశ్వర రథోత్సవం

Feb 17 2026 7:32 AM | Updated on Feb 17 2026 7:32 AM

భోగ,

భోగ, యోగ నందీశ్వర రథోత్సవం

చిక్కబళ్లాపురం: నగరం సమీపంలోని నందిగ్రామలో నెలకొన్న శ్రీ భోగనందీశ్వరస్వామి దేవస్థానం జోడు బ్రహ్మ రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. జిల్లా మంత్రి ఎంసీ సుధాకర్‌ తేరు సంబరాన్ని ప్రారంభించారు. వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి నుంచి ఆలయంలో మహాశివునికి అభిషేకం, పూజలు చేసి జాగరణ చేశారు. తెల్లవారువరకు భజనలు, భక్తి గాన కచేరీలు సాగాయి. సోమవారం ఉదయం నుంచి రథోత్సవం ఆరంభమైంది. భోగనందీశ్వర స్వామి, యోగ నందీశ్వరస్వామి రథాలను ఆలయం చుట్టు ప్రదక్షిణ చేశారు. బెంగళూరుతో పాటు ఏపీ, తమిళనాడు నుంచి భక్తులు వచ్చారు. హర హర మహదేవ్‌ అంటూ తేర్లను లాగారు.

భోగ, యోగ నందీశ్వర రథోత్సవం 1
1/1

భోగ, యోగ నందీశ్వర రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement