రీల్స్‌ చేసే వారు ఇంటిని కాలుస్తారా? | - | Sakshi
Sakshi News home page

రీల్స్‌ చేసే వారు ఇంటిని కాలుస్తారా?

Jan 25 2026 6:58 AM | Updated on Jan 25 2026 6:58 AM

రీల్స

రీల్స్‌ చేసే వారు ఇంటిని కాలుస్తారా?

సాక్షి,బళ్లారి: సాధారణంగా ఎవరైనా రీల్స్‌ చేసే వారు ఇంటికి నిప్పు పెడతారా? పథకం ప్రకారమే తమ ఇంటిపై పెట్రోల్‌, డీజిల్‌ చల్లి నిప్పు పెట్టారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నగరంలోని జీ స్క్వేర్‌ లేఅవుట్‌లో నిప్పుపెట్టిన మోడల్‌ హౌస్‌ను పరిశీలించి మాట్లాడారు. 200 ఎకరాల్లోని జీస్క్వేర్‌ లేఅవుట్‌లో మోడల్‌ హౌస్‌ నిర్మించామన్నారు. ఇందులో నాలుగు నెలల క్రితం కూడా దొంగతనం జరిగిందన్నారు. అప్పుడు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసి, పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఒత్తిడి, ఏఎస్పీ రవికుమార్‌ ఇద్దరూ కలిసి అప్పట్లో ఎఫ్‌ఐఆర్‌ కూడా చేయించకుండా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రస్తుతం నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి కూడా ఏఎస్పీ రవికుమార్‌ను విచారణాధికారిగా నియమించడంతో ఇక ఏం న్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో కచ్చితంగా ఎమ్మెల్యే ప్రమేయంతోనే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇప్పటికీ ఎమ్మెల్యేని అరెస్ట్‌ చేయలేదు

తమ ఇంటి వద్ద కాల్పులు, రగడ జరిగి ఓ యువకుడు మృతి చెందిన విషయంలో ఇప్పటికీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిని, అతని ఆప్తుడు సతీష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఇంటికి నిప్పు పెట్టిన ఘటనపై ఏఎస్పీతో విచారణ చేయిస్తే ఎలాంటి పురోగతి ఉండదన్నారు. తాము ఏఎస్పీ రవికుమార్‌ని, డీఎస్పీ నందారెడ్డిని ఈ ఘటనలో సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మోడల్‌హౌస్‌ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులను వీడియో కూడా తీశారన్నారు. నూతనంగా బాధ్యతలను తీసుకున్న ఎస్పీపై తమకు గౌరవం ఉందన్నారు. అయితే ఏఎస్పీని పంపించి విచారణ చేయించడంలో అర్థం లేదన్నారు. ప్రస్తుతం అరెస్ట్‌ చేసిన దుండగులపై తాము 5 నెలల క్రితమే ఫిర్యాదు చేశామన్నారు. అప్పట్లో ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌పై ఒత్తిడి తీసుకొచ్చి కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారన్నారు. ఈ ప్రాపర్టీపై కన్నేసి ఇలా చేయిస్తున్నారన్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీ తిరిగే విధంగా తాము ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోలేదన్నారు. ఏఎస్పీ రవికుమార్‌ను ఇక్కడికి పంపిస్తే కింది స్థాయి పోలీస్‌ అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురి అవుతారో అర్థం చేసుకోవచ్చన్నారు.

న్యాయం జరిగేంత వరకు పోరాడతాం

అసెంబ్లీలో కూడా బళ్లారి కాల్పులపై ప్రస్తావించామని, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. బళ్లారి ఘటనపై దర్యాప్తును ఎందుకు సీబీఐకి అప్పగించలేదు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీబీఐకి అప్పగించడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో చెప్పాలన్నారు. బళ్లారి కాల్పుల్లో యువకుడు రాజశేఖర్‌ మృతి చెందిన ఘటనలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్స్‌ను కాపాడేందుకు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. బళ్లారి ప్రజలను భయభ్రాంతులను చేయడానికి వార్డువార్డులో క్రిమినల్స్‌ను తయారు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే తమ మోడల్‌ హౌస్‌కు నిప్పుపెట్టారన్నారు. ఎస్పీ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీల్స్‌ చేసే వారు ఎవరైనా ఇంటికి నిప్పు పెడతారా? గమనించాలన్నారు. కచ్చితంగా ఎమ్మెల్యే ప్రమేయంతోనే మోడల్‌ హౌస్‌కు నిప్పు పెట్టారనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్‌రెడ్డి, సురేష్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పథకం ప్రకారమే పెట్రోల్‌, డీజిల్‌ చల్లి నిప్పు పెట్టారు

ఏఎస్పీతో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు

జీ స్క్వేర్‌పై ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి కన్నేశారు

గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి ఆరోపణ

రీల్స్‌ చేసే వారు ఇంటిని కాలుస్తారా? 1
1/1

రీల్స్‌ చేసే వారు ఇంటిని కాలుస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement