బళ్లారి గొడవ కేసును సీబీఐకి ఇవ్వాలి
శివాజీనగర: సిద్దరామయ్య గతంలో సీఎంగా ఉండగా కరెక్ట్ అని చెప్పుకునేందుకు 7 కేసులను సీబీఐకి అప్పగించారు, అలాంటి మహానుభావుడు బళ్లారి కాల్పుల కేసును సీబీఐకి ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ వేస్తారని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. ఆయన సోమవారం బెంగళూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బళ్లారి గొడవ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు, యడియూరప్ప ప్రభుత్వ కాలావధిలో ఎన్ని సీబీఐకి ఇచ్చారు. సిద్దరామయ్య కాలావధిలో ఎన్ని అప్పగించారనే ప్రశ్న ముఖ్యం కాదన్నారు. ముగ్గురు ప్రైవేట్ గన్‌మ్యాన్‌లను అరెస్ట్‌చేసి, సీఐడీతో విచారణ జరిపి ప్రజలు మరిచిపోయేటట్లు చేస్తున్నారు, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయరాదనే మీ దురాలోచన దీనిద్వారా బయటపడిందని సీఎంపై మండిపడ్డారు. క్రిమినల్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఐదారు వేలమందితో తమ ఇంటికి వచ్చి పెట్రోల్ చల్లి, గన్ ఫైరింగ్ చేయడం వల్ల ఒక అమాయకుడు చనిపోయాడని చెప్పారు. ఇది తనపై జరిగిన హత్యా ప్రయత్నమన్నారు.
గతంలో వాల్మీకి మండలిలో అవినీతి వల్ల శివమొగ్గలో ఆ మండలి అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని జనార్దనరెడ్డి తెలిపారు. వాల్మీకి వర్గానికి చెందిన శ్రీరాములు బళ్లారి నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేసేందుకు ఆసక్తితో ఉన్నారని చెప్పారు. వాల్మీకి వర్గానికి భరత్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు.
సీఎం సిద్దరామయ్యకు బీజేపీ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి డిమాండ్


