రూ.70 లక్షల పన్ను ఎగవేత.. బెంట్లీ కారు సీజ్
దొడ్డబళ్లాపురం: ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆరోపణలపై ఆర్టీఓ అధికారులు ఎంతో ఖరీదైన బెంట్లీ కారును సీజ్ చేసిన సంఘటన బెంగళూరు కోరమంగలలో జరిగింది. ఈ కారు విలువ రూ. 5.50 కోట్లు అయితే, ఆర్‌టీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సమయంలో రూ.2.43 కోట్లుగా చూపించారు. తద్వారా రూ.70 లక్షల ట్యాక్స్‌ను ఎగ్గొట్టినట్టు తేలింది. దీంతో కోరమంగల ఆర్టీఓ అధికారులు బెంట్లీ కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా కారు యజమాని అధికారులతో గొడవకు దిగాడు. విజయ్ మల్య లాగా వందల కోట్ల రూపాయలు మోసం చేయలేదని, అలాంటి వాళ్లను పట్టుకునే దమ్ము ఎవరికీ లేదని చిందులు వేశాడు.
చిక్కదేవమ్మ జాతర
మైసూరు: మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకా కుందూరు గ్రామంలో శ్రీ చిక్కదేవమ్మ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలకు ముందు, చిక్కదేవమ్మ కొండ నుంచి ఉత్సవ దేవతను కుందూరుకు తీసుకువచ్చారు. ఉదయం ఆలయ సమీపంలో బిజాసురుడు అనే రాక్షసున్ని అమ్మవారిచే వధింఛే ఘట్టం ఆచరించారు. తరువాత విజయోత్సవాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం వందలాదిగా క్యూలలో తరలివచ్చారు. ఎమ్మెల్యే అనిల్ చిక్కమధు ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఈసారి జాతర మహోత్సవాన్ని సక్రమంగా జరుపుకొన్నారని అభినందించారు.
ధర్మం ద్వారా సార్థక జీవనం
తుమకూరు: ధర్మం మనకు ప్రేమ, సమైక్య జీవనాన్ని నేర్పిస్తుందని, అలాంటి వ్యక్తిత్వం ద్వారానే మనం దేవున్ని చూడగలమని పట్టనాయకహళ్లిలోని స్ఫటికపురి గురుగుండ బ్రహ్మశ్వర స్వామి పీఠాధిపతి నంజావదూత స్వామీజీ అన్నారు. గురుగుండ బ్రహ్మేశ్వర స్వామి జాతర మహోత్సవంలో ఆదివారం ధర్మ పతాక ఆవిష్కరణ జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ మనమందరం దేవుని అంశ, దానిని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు మానవ జన్మను ఇచ్చాడు. మన దేశ శాశ్వత మతం, వారసత్వాన్ని కాపాడుకునే లక్ష్యంతో జాతరలు, పండుగలు జరుగుతాయి. మనమందరం ఒకటే అనే భావనతో ముందుకు సాగినప్పుడు, మానవ జన్మ అర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
టమాటా.. నష్టాలకు టాటా
● కోలారు ఏంపీఎంసీ మార్కెట్‌లో
మంచి ధరలు
కోలారు: కోలారు ఎపిఎంసి మార్కెట్‌లో టమాటా ధరలు రోజు రోజుకు పెరుగుతుండడం రైతులకు సంతోషం కలిగిస్తోంది. వారితో పాటు దళారులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇక్కడ 15 కేజీల టమాటా బాక్సు రూ.850 వరకు అమ్ముడవుతోంది. మంచి నాణ్యత కలిగిన టమాటాలకు మరింత ధర ఉంది. బయట మార్కెట్‌లో కిలో రూ. 50 నుంచి 60 మధ్య కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో రేట్లు పెరగడం వల్ల టమాటా రైతులకు అంతో ఇంతో ఆదాయం లభిస్తోంది. ఎపిఎంసి మార్కెట్‌కు టన్నుల కొద్దీ పంటను రైతులు తరలిస్తున్నారు. తమిళనాడు నుంచి టమాటాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది, అక్కడి నుంచి వ్యాపారులు వచ్చి లారీలలో తీసుకు వెళుతున్నారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్‌ల నుంచి కూడా డిమాండ్ నెలకొంది. చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపుర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాల నుంచి కూడా రైతులు టమాటాను తీసుకువస్తున్నారని మార్కెట్ కార్యదర్శి కిరణ్ తెలిపారు.
రూ.70 లక్షల పన్ను ఎగవేత.. బెంట్లీ కారు సీజ్
రూ.70 లక్షల పన్ను ఎగవేత.. బెంట్లీ కారు సీజ్
రూ.70 లక్షల పన్ను ఎగవేత.. బెంట్లీ కారు సీజ్


