న్యాయ సేవల లబ్ధి పొందండి
రాయచూరు రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టం, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాయచూరు జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిక్ పిలుపునిచ్చారు. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా ప్రాధికార, కార్మిక శాఖ, కట్టడ కార్మికుల కళ్యాణ మండలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క పౌరుడు మానవ హక్కుల సంరక్షణ గురించి తెలుసుకోవాలన్నారు. అప్పుడే ఉచితంగా న్యాయ సలహాలు పొందడానికి వీలవుతుందన్నారు. రాయచూరు జిల్లాలో 1.07 లక్షల మంది కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారని జిల్లా కార్మిక శాఖాధికారి అరతి వెల్లడించారు. కార్యక్రమంలో అవినాష్, రాజేశ్వరి, ప్రియాంక, నాగరాజ్, తిప్పేస్వామి, రంగప్ప, వెంకటేష్, వీరనగౌడ, చెన్నప్ప, మంజునాథ్‌లున్నారు.
టీచర్‌పై పోక్సో కేసు.. ఇద్దరు ఖాకీలపై వేటు
హుబ్లీ: హావేరి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి మెడలో చెప్పుల మాల వేసి ఊరిలో ప్రదర్శన నిర్వహించిన సంఘటనలో సవణూరు పోలీస్ స్టేషన్ సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలను వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆరోపణలపై సీఐ దేవానంద్, హెడ్‌కానిస్టేబుల్ మల్లికార్జునను సస్పెండ్ చేస్తూ ఎస్పీ యశోద వంటగోడి ఆదేశాలను వెల్లడించారు. ఈనెల 10న సవణూరులో పోక్సో కేసు నిందితుడైన ఉపాధ్యాయుడిని అవమానించిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. టీచర్ జగదీశ్‌పై అక్కడి స్థానికులు తీవ్రంగా దాడి చేసి మెడలో చెప్పుల మాల వేసి పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్ వరకు వీధుల్లో ఊరేగించారు. కాగా సదరు టీచర్‌పై అడవి జంతువుల్లా దాడి చేస్తున్నా కూడా పై ఇద్దరు పోలీస్ సిబ్బంది తగిన నివారణ చర్యలు తీసుకోక పోవడంపై బాధితుడైన టీచర్ తనపై దాడి చేసిన 22 మందిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులపై విమర్శలు రావడంతో ఎస్పీ ఈ చర్య తీసుకున్నారు.
దివ్యాంగుల క్రీడా పోటీలు
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లిలోని తాలూకా స్టేడియంలో తాలూకా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు జరిగాయి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా తాలూకా యంత్రాంగం, తాలూకా, దివ్యాంగుల సీనియర్ సిటిజన్ల సాధికారత విభాగం, దివ్యాంగులకు సేవలందించే సంస్థలు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై.హెచ్.చంద్రశేఖర్ ప్రారంభించారు. దివ్యాంగులకు షాట్‌పుట్, వీల్‌చైర్ రేస్, రన్నింగ్ రేస్, త్రోబాల్ మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు.
స్లం వాసులకు ఇళ్ల పట్టాలివ్వండి
రాయచూరు రూరల్: నగరంలోని మురికి వాడల కాలనీలో నివాసమున్న వాసులకు ఇళ్ల పట్టాలను అందించాలని మురికి వాడల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మంగళవారం బెళగావి విధానసౌధ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. 1991–92లో సర్వే నంబర్– 572, 573, 574లలో నివాసముంటున్న వారికి నేటికీ పట్టాలు ఇవ్వకుండా నగరసభ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. సుమారు 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ గృహ వసతి శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌కు వినతిపత్రం సమర్పించారు.
లోకాయుక్త న్యాయవాది నియామకం
రాయచూరు రూరల్: లోకాయుక్తకు వచ్చిన ఫిర్యాదులను వాదించడానికి రాయచూరు నుంచి న్యాయవాది మల్లినాథ్ ఎస్. హిరేమట్‌్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధులు నిర్వహించిన ఇందూధర్ పాటిల్ పదవీ కాలం ముగియడంతో త్వరితగతిన బాధ్యతలు చేపట్టాలని ఆదేశిస్తూ లోకాయుక్త జాయింట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
న్యాయ సేవల లబ్ధి పొందండి
న్యాయ సేవల లబ్ధి పొందండి
న్యాయ సేవల లబ్ధి పొందండి


