ధరల దరువు.. పంపిణీ బరువు
హుబ్లీ: ఎంతో మహదాశయంతో ప్రారంభించిన విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ పథకానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల కారణంగా విద్యార్థులకు సక్రమంగా అందాల్సిన కోడిగుడ్లు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థల్లో గుడ్లు, అరటి పండు పంపిణీ చేసే వారు. మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులకు అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారంలో నాలుగు రోజులు గుడ్లు పంపిణీ చేసే వారు. గుడ్ల పంపిణీ విషయం సవాల్‌గా మారిందని చెబుతున్నారు. ఓ చంటి బిడ్డకు నిత్యం గుడ్డు ఇవ్వడానికి ప్రభుత్వం రూ.6 భరిస్తుంది. అయితే మార్కెట్‌లో మాత్రం నిత్యం గుడ్ల ధరలు తీవ్రంగా పెరిగిన క్రమంలో కొందరు ఉపాధ్యాయులే డబ్బులు భరించి గుడ్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.
నిధుల లేమితో నిలిచిన పంపిణీ
పంపిణీకి కావాల్సిన నిధుల లభ్యత లేకపోవతడంతో విద్యార్థులపై ఈ ప్రభావం పడింది. 83 వేల దమంది గుడ్లు, 30 వేల మంది పిల్లలకు అరటి పండ్లు పంపిణీ చేసే గురుతర బాధ్యతలను ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించడంతో ఉపాధ్యాయులపై కొంచెం భారం పడిందని సమాచారం. రాష్ట్రంలో 53 లక్షల మందికి వారంలో రెండు రోజులు పంపిణీ చేసే వారు. అయితే ప్రస్తుతం గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. వారానికి రెండు రోజులు పంపిణీ చేస్తుండగా క్రమేణ అది 6 రోజులకు విస్తరించారు. తాజాగా గుడ్లు, అరటి పండ్లను వారంలో 6 రోజులకు సరిపడా పండ్లు క్రమం తప్పకుండా మంజూరు చేయాలని అందరూ ఆశిస్తున్నారు.
గత బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు
6 రోజుల పాటు పౌష్టిక ఆహారం లభ్యత ఉంటే ఇక పిల్లల్లో పౌష్టిక ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. సదా ఈ ఉత్తమ పథకానికి వ్యాపార దిగ్గజం అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. గత మార్చి బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. దావణగెరె జిల్లాలో సుమారు 1.21 లక్షల మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం పరిధిలోకి వస్తున్నారు. ఈ మేరకు గత నవంబర్ వరకు 83,436 పిల్లలకు గాను 70 శాతం మంది పిల్లలు గుడ్లు తింటున్నారు. 38,334 మంది ప్రకారం 30 శాతం విద్యార్థులు మొత్తానికి ఈ పథకంపై ధరల పెంపు ప్రభావం చూపుతోంది.
పాఠశాలల్లో పిల్లలకు అందని కోడి గుడ్డు
సవాల్‌గా పరిణమించిన కోడిగుడ్ల సరఫరా


