బృహత్ ధర్నాను విజయవంతం చేయండి
కోలారు: డిమాండ్‌ల సాధన కోసం ఈ నెల 21వ తేదీన బెంగళూరులో నిర్వహించే బృహత్ ప్రతిఘటనను విజవంతం చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. సామాన్య ప్రజలు, రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాల విదానాలను ఈ ధర్నా ద్వారా ఎండగడుతామన్నారు. కోలారు జిల్లాకు ఎత్తినహొళె పథకాన్ని పూర్తి చేసి సాగునీటిని అందించాలని, కేసీ వ్యాలిని నీటిని మూడు దశలలో శుద్ధీకరించి చెరువులకు అందించాలని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాకు జిల్లా నుంచి వేలాది మంది తరలివస్తారన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి గాంధీ నగర నారాయణస్వామి, తాలూకా కార్యదర్శి వెంకటేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
శ్రీనివాసపురం: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎకై ్సజ్ శాఖ కమిషనర్ సయ్యద్ హజరత్ ఆఫ్రీన్ సూచించారు. పట్టణంలోని కట్టెకళగిన పాళ్య, అంబేడ్కర్ పాళ్య, ఇందిరానగర తదితర ప్రాంతాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గుట్కా, గంజాయి వంటి డ్రగ్స్ ఆరోగ్యంపై తీవ్ర చెడు ప్రభావం చూపుతాయన్నారు. డ్రగ్స్ పెడ్లర్లు తొలుత డ్రగ్స్‌ను ఉచితంగా అందజేసి దానికి బానిసలను చేస్తారన్నారు. అనంతరం డబ్బు ఎక్కువ మొత్తం గుంజుతారన్నారు. డ్రగ్స్ మాఫియాను సమాజనుంచి తరిమివేయాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఎకై ్సజ్ శాఖ డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐలు పుష్ప, శశికళ, మునిరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
బృహత్ ధర్నాను విజయవంతం చేయండి


