లోకాయుక్త ఆకస్మిక దాడులు
శివమొగ్గలో తాగునీటిశాఖ కార్యాలయం
శివమొగ్గలో ఈఈ రూప్లానాయక్ నివాసంలో సోదాలు
బనశంకరి: ఉద్యోగాల చాటున ఆదాయానికి మీరి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై లోకాయుక్త దాడులు జరిపింది. మంగళవారం బెళగావి, హావేరి, చిత్రదుర్గ, ధార్వాడ, శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో సోదాలు జరిగాయి.
ఎక్కడెక్కడ అంటే..
● బెళగావి వ్యవపాయ విజిలెన్స్ డిప్యూటి డైరెక్టర్ రాజశేఖర్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప , డీఎస్‌పీలు కురబగట్టి, వెంకనగౌడపాటిల్ పాల్గొన్నారు. ఆయనకు చెందిన బెళగావి, ధార్వాడ, హావేరి తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
● శివమొగ్గలో జిల్లా గ్రామీణ తాగునీటి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూప్లానాయక్ ఇంటిలో తనిఖీలు ప్రారంభించారు. ఆయన కుటుంబం నివాసం ఉండే బెంగళూరు ఇంటిలోనూ సోదాలు చేశారు. చిక్కమగళూరు కడూరులో ఆయన సహాయకుడు తాంబే ఇంటినీ సోదాలు చేశారు. మొత్తం 6 లోకాయుక్త బృందాలు పాల్గొన్నాయి.
● విజయనగర జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ శంకర్‌నాయక్ కార్యాలయం, ఇళ్లు, ఆసుపత్రిపై దాడిచేశారు. లోకాయుక్త డీఎస్పీ సచిన్, సీఐ అమరేశ్, రాజేశ్‌లమాణి పాల్గొన్నారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో డబ్బు, బంగారం, విలువైన సొత్తు లభించినట్లు తెలిసింది.
ముగ్గురు అధికారుల ఇళ్లలో సోదాలు
లోకాయుక్త ఆకస్మిక దాడులు


