ఉల్కలపై అవగాహన
రాయచూరు రూరల్: గ్రామీణ విద్యార్థులకు ఉల్కలు, వాటి నుంచి సంభవించే సమస్యలను తెలుసుకోవాలని అధ్యాపకుడు షంషుద్ధీన్ తెలిపారు. జేగర్‌కల్‌లో రోటరీ క్లబ్ భారత జ్ఙాన, విజ్ఙాన సమితి, గురుకృప ట్రస్టు ఆధ్వర్యంలో ఉల్కలు, వాటి పాత్రపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. షంషుద్ధీన్ మాట్లాడుడూ పగటి వేళల్లో అకాశాన్ని ఎలా చూస్తారో.. రాత్రి వేళల్లోనూ ఉల్కలను అలా చూసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. మానవుడు తన చుట్టూ జరిగే విషయాలపై అవలోకనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, హఫీజుల్లా, ఉమేష్, జనార్దన, వేంకటేష్, మల్లమ్మ, ఫరీదా బేగం, అమరేష్, తదితరులు పాల్గొన్నారు.


