కబ్జాదారుల భరతం పట్టాలని ధర్నా
కోలారు: కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ సమతా సైనిక దళ కార్యకర్తలు గురువారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేజీఎఫ్ తాలూకా బేతమంగల పబ్లిక్ శౌచాలయం స్థలాన్ని కొంతమంది ఆక్రమించి గదిని నిర్మించి బాడుగకు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్యాసంబళ్లి ఫిర్కా కాజిమిట్టహళ్లి ప్రభుత్వ గోమాళం భూమి 15 ఎకరాలలో అక్రమంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. దీనిపై దాఖలాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ భరత్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రతిఘటనలో సమతా సైనికదళ పదాధికారులు భారతమ్మ, ముని వెంకటస్వామి, బాల సుబ్రమణి తదితరులు పాల్గొన్నారు.


