చెన్నబసవ స్వామీజీ మృతి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా ఇంగళేశ్వర గ్రామానికి చెందిన వచన శిలామంటపను స్థాపించిన చెన్నబసవ స్వామీజీ (94) మృతి చెందారు. గురువారం స్వామీజీ మృతి చెందారని, శుక్రవారం స్వామీజీ అంత్యక్రియలు నిర్వహిస్తారని, ఇంగళేశ్వర గ్రామంలో పార్థివదేహాన్ని ఊరేగించిన అనంతరం క్రియా సమాధిని చేస్తారని స్థానికులు వెల్లడించారు. స్వామీజీ మృతి చెందడంపై విజయపుర జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు ఆయన ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన తీరును కొనియాడుతూ సంతాపం వ్యక్తం చేశారు.
వైద్య విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: గదగ్ జిల్లా ముండరగి పట్టణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ బీఏఎంఎస్ విద్యనభస్యసిస్తున్న ఈశ్వర్ (21) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హాస్టల్‌లో ఉరి వేసుకుని మృతి చెందారని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్టల్ సిబ్బంది, యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో సంవత్సరంలో బీఏఎంఎస్ కోర్సు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ కుమారుడు మృతి చెందడంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
నీటికుంటలో ఇద్దరు
యువకుల జలసమాధి
సాక్షి,బళ్లారి: ప్రమాదశాత్తు నీటికుంట(ఫారంపాండ్)లో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా బీ.ఆర్. గ్రామ సమీపంలో గొర్రెలను మేపడానికి వెళ్లిన మారుతీ(19), విశ్వనాథ్(23) అనే ఇద్దరు యువకులు నీటికుంటలో గొర్రెలను శుభ్రం చేయాలని వాటిని పట్టుకుని దిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై చిత్రదుర్గ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కేంద్రమంత్రిని నిందిస్తారా?
రాయచూరు రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏకవచనంతో నిందించడం సరికాదని రాయచూరు జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు, నగరసభ మాజీ అధ్యక్షురాలు కుడుగోలు లలిత ఆరోపించారు. టిప్పుసుల్తాన్ ఉద్యాన వనం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. సిద్దరామయ్యకు భారతీయ సంప్రదాయాలు, మహిళలపై గౌరవం లేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన సిద్దు మహిళలను అగౌరవ పరిచే విధంగా వ్యాఖ్యానించడం తగదన్నారు. గ్రామీణ భాషలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలను విమర్శించే హక్కు సిద్దరామయ్యకు ఉందా? అని ప్రశ్నించారు. సిద్దరామయ్యపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
మానవహక్కులతో
శాంతియుత జీవనం
శ్రీనివాసపురం: శాంతియుత జీవనంలో మానవ హక్కుల పాత్ర కీలకమని డీఎస్పీ మనీషా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన విశ్వ మానవహక్కుల దినోత్సవంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. మానవ హక్కులకు భంగం కలగకుండా జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. జాతీయ మానవ హక్కుల జాగృతి, అవినీతి నిర్మూలన సంస్థ జనసేవా ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు శివకుమారగౌడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు హక్కులు ఉంటాయన్నారు. తహసీల్దార్ సుధీంద్ర, జిల్లా న్యాయ సేవల ప్రాధికార ఉప ప్రధాన అధికారి సతీష్ పాల్గొన్నారు.
కంటి ఆస్పత్రి ప్రారంభం
కృష్ణరాజపురం: కృష్ణరాజపురంలోని గృహ నిర్మాణ సహకార సంఘం నూతన భవనంలో ఏర్పాటు చేసిన నారాయణ కంటి ఆస్పత్రిని ఎమ్మెల్యే బీఏ బసవరాజు ప్రారంభించి లోకార్పణం చేశారు. ఆరోగ్య బీమా, యశస్విని కార్డు, వివిధ బీమాల ప్రాయోజకత్వంలో రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్టు
హోసూరు: గంజాయి విక్రయిస్తూ ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి పోలీసులకు పట్టుబడ్డారు. కడలూరు జిల్లాకు చెందిన రోహిత్(19) స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. హోసూరు పారిశ్రామిక వాడ జూజువాడి చెక్‌పోస్టు వద్ద మద్య నిషేధ శాఖ పోలీసులు గస్తీ నిర్వహించగా.. రోహిత్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అతడిని అదుపు లోకి తీసుకొని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అతడి వద్ద 510 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మారుతీ(ఫైల్)
విశ్వనాథ్(ఫైల్)
చెన్నబసవ స్వామీజీ మృతి
చెన్నబసవ స్వామీజీ మృతి
చెన్నబసవ స్వామీజీ మృతి


