మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. గురువారం లింగసూగూరు తాలూకా హట్టి పైభవనం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు రమేష్ మాట్లాడారు. నేడు మహిళలు, పిల్లలపై వేధింపులు, చిత్రహింసలు అధికమయ్యాయన్నారు. అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, లైంగిక దౌర్జన్యాలు, వరకట్నం, కుటుంబ కలహాలు, భ్రూణ హత్యలు, లింగ తారతమ్యాలు, కుల, మత, వర్గ వైష్యమాలు పెరిగాయన్నారు. మహిళల హక్కుల ఉల్లంఘన, బేటీ పడావో, బేటీ బచావో పద్ధతి ప్రకటనలకే పరిమితమైందన్నారు. వీటన్నింటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
సమాజాభివృద్ధికి సహకరించాలి
రాయచూరు రూరల్: మాదార సమాజం అభివృద్ధికి అందరూ సహకరించాలని మాదార చెన్నయ్య సమాజం కార్యాధ్యక్షుడు రవీంద్ర జాలదార్ పేర్కొన్నారు. ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మాదార చెన్నయ్య సేవా సమితి నూతన పదాధికారుల ప్రమాణ వచన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజంలో కింది స్థాయిలో నివాసముంటూ కష్టపడి పని చేసే మనస్తత్వం కలవారన్నారు. నేటి పోటీ తత్వయుగంలో మన పిల్లలను సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా వారిని అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వీరేష్, భీమరాయ, మంచాల భీమన్న, భీమరాజ్, మౌనేష్, పరశప్ప, రమేష్‌లున్నారు.
గూడ్స్ రైలు ఢీకొని
వ్యక్తి దుర్మరణం
రాయచూరు రూరల్: గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రాయచూరు తాలూకాలో చోటు చేసుకుంది. బిచ్చాలి గ్రామ పంచాయతీ పరిధిలోని బీ.యడ్లాపూర్‌కు చెందిన సంజీవ్(35) అనే వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రతి రోజు పొలానికి రైలు పట్టాలు దాటి వెళుతుంటాడు. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటుతున్న సంజీవ్‌ను గూడ్స్ రైలు ఢీకొంది. వారిస్తున్నా వినకుండా సంజీవ్ అలాగే పట్టాలు దాటాడని సమాచారం. పంచనామా కోసం మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల
మూసివేత తగదు
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాలలోకి విలీనం చేయడానికి ముందుకొచ్చిన సర్కార్ తీరుపై ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్ చేసింది. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని ఒత్తిడి చేశారు.
గంగమ్మకు మండల పూజ
మాలూరు: తాలూకాలోని మాస్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవి దేవాలయంలో గురువారం విమానగోపుర, కుంభాభిషేకం కార్యక్రమాలు, 48వ రోజు మండల పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూల అలంకరణ, ఆభరణాల అలంకరణ చేసి పూజలు నిర్వహించి మహామంగళారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాద పంపిణీ, అన్న సంతర్పణ జరిగింది.
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టాలి


