అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చని కాంగ్రెస్
కేజీఎఫ్ : దేశంలో 75 సంవత్సరాల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చలేదని, అలాంటి పార్టీకి అంబేడ్కర్ పేరును ప్రస్తావించే నైతిక హక్కు లేదని కేంద్ర మాజీ మంత్రి ఏ.నారాయణస్వామి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని మున్సిపల్ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన భీమనడె కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సమస్యలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సముదాయానికి చెందిన రూ.198 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని, దీనిని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు. మైసూరు మాజీ ఎంపీ ప్రతాప్ సింహ మాట్లాడుతూ అంబేడ్కర్ ముంబై నుంచి పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే అందరికీ రక్షణ కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మునిస్వామి, కేజీఎఫ్ మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి, మాలూరు మాజీ ఎమ్మెల్యే మంజునాథ్‌గౌడ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చని కాంగ్రెస్


