వికటించిన రాత్రి భోజనం
రాయచూరు రూరల్: కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థుఽలు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం రాత్రి యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో చోటు చేసుకుంది. గురుమఠకల్‌లోని వెనుక బడిన వర్గాల బాలికల సంక్షేమ హాస్టల్‌లో రాత్రి విద్యార్థులు చికెన్, చపాతి, అన్నం తిన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వీరిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో యాదగిరి జిల్లాస్పత్రిలో చేర్పించారు. హాస్టల్‌లో మొత్తం 150 మంది విద్యార్థినులున్నారు. ఘటన విషయం తెలుసుకున్న యాదగిరి జిల్లాధికారి హర్షల్ బోయర్, జెడ్పీ సీఈఓ లవీశ్ ఒడెయర్, ఎస్పీ పృథ్వీశంకర్, ఇతర అధికారులు చేరుకుని పరిశీలించారు.
హాస్టల్‌లో కలుషితమైన ఆహారం
33 మంది విద్యార్థుఽలకు అస్వస్థత
యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో ఘటన
వికటించిన రాత్రి భోజనం


