మడికెరి హోంస్టేలో.. హనీట్రాప్
దొడ్డబళ్లాపురం: హనీ ట్రాప్‌లో పడ్డ యువకుడు యువతి వద్ద నుంచి భయాందోళనతో నగ్నంగా రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చాడు. ఈ వింత సంఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... మహేశ్ అనే యువకునికి ఫేస్‌బుక్‌లో యువతి పరిచయమైంది. తరువాత ఫోన్‌లో మాట్లాడుకోసాగారు. ఆమె పిలవడంతో అతడు మడికెరికి వచ్చి హోంస్టేలో బసచేశాడు. యువతి కూడా అక్కడే ఉంది. అయితే అతడు బట్టలు లేకుండా కేకలువేస్తూ బయటకు పరుగులు తీయడంతో జనం చూసి ఆశ్చర్యపోయారు. ఎవరో దొంగ అనుకుని జనం అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి తనను హనీట్రాప్ చేసినట్టు మహేశ్ తెలిపాడు. లోపల గదిలోకి వెళ్లాను, ఆమెతో పాటు కొందరు వ్యక్తులు ఉన్నారు, నన్ను నగ్నంగా చేసి డబ్బులు డిమాండు చేశారు. జేబులో ఉన్న నగదు, మొబైల్ లాక్కున్నారు. ఎలాగో తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. పోలీసులు యువతి, మిగతావారిపై కేసు నమోదు చేసుకున్నారు.
నవ వివాహిత ఆత్మహత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో జరిగింది. వివరాలు.. ఐశ్వర్య (22) 7 నెలల క్రితం పెద్దలను ఎదిరించి లక్ష్మినారాయణ అనే యువకున్ని ప్రేమ వివాహం చేసుకుంది. తన చెల్లెలి పుట్టినరోజు ఉంది, పుట్టింటికి వెళతానని భర్తను కోరింది. అయితే భర్త నిరాకరించడంతో ఆవేదన చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నగ్నంగా పరుగులు తీసిన యువకుడు
యువతి, ముఠాపై కేసు


