నాడు వైభవం.. నేడు దుర్భరం
మరమ్మతుకు నోచుకోని తుంగభద్ర తరగతి గది కిటికీ, తలుపులు
దుస్థితిలో పాఠశాలలోని కృష్ణా తరగతి గది
శిథిలావస్థకు చేరుకున్న హేమనాళలోని ప్రభుత్వ పాఠశాల భవనం
రాయచూరు రూరల్: జిల్లాలో నాడు ఏళ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది వైభవంగా వెలిగిన పాఠశాలలు మరమ్మతులకు నోచుకోక నేడు దుర్భర స్థితికి చేరాయి. విద్యా రంగంలో వెనుక బడిన జిల్లాగా పేరొందిన రాయచూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా సర్కార్ బడులు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో బడులున్నా అత్యాధునిక వసతులతో కూడిన గదులు లేక ఉపాధ్యాయులకు చెట్ల కిందే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వస్తోంది. కళ్యాణ కర్ణాటకలో విద్యా రంగాభివృద్ధికి ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు ప్రకటిస్తున్న సర్కార్ మాటల గారడీతో ప్రజా ప్రతినిధులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ప్రతి గ్రామంలో ఇలాంటి బడులు కనిపిస్తున్నాయి. పాఠశాల భవనాలు దాదాపుగా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని పాఠశాలల మరమ్మతుకు కేటాయించిన నిధులను ఇతరత్ర పనులకు వాడుకోవడం వల్ల అవి దుస్థితిలో మిగిలి పోతున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 10 గదుల నిర్మాణానికి ఈ ఏడాది రూ.2.84 కోట్ల నిధులను మాత్రమే కేటాయించారు.
ఆరు బయట చెట్ల నీడనే విద్యార్థులకు పాఠాల బోధన
పాఠశాలలో విరిగిపోయిన బెంచీలు
శిథిలావస్థలో హేమనాళ సర్కారు బడి
ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచని వైనం
నాడు వైభవం.. నేడు దుర్భరం
నాడు వైభవం.. నేడు దుర్భరం
నాడు వైభవం.. నేడు దుర్భరం
నాడు వైభవం.. నేడు దుర్భరం


