వైభవంగా దుర్గాదేవి దీపోత్సవం
హొసపేటె: హొసపేటెలోని తళవారకేరి రాంపూర్ దుర్గాదేవి దీపోత్సవం శుక్రవారం సాయంత్రం జరిగింది. జాతర, రథోత్సవాల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా దీపాలు వెలిగించి భక్తులు కోరికలు నెరవేర్చుకున్నారు. దేవికి పూలు, పండ్లు, గింజలు, కర్పూరం సమర్పించారు. హరికథ, భజనలు, పాటలు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు దుర్మరణం
హొసపేటె: ఐషర్ వాహనం, లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాత్రి విజయనగర జిల్లాలోని కూడ్లిగి తాలూకా బణవికల్లు వద్ద జాతీయ రహదారి– 50పై చోటు చేసుకుంది. ఘటనలో గదగ్‌కు చెందిన రైతు రంగప్ప(35), డ్రైవర్ గణేష్(39) అక్కడికక్కడే మరణించారు. గదగ్‌లో పండించిన ఉల్లి పంటను యలహంక మార్కెట్‌కు ఐషర్‌లో వాహనంలో తరలిస్తుండగా ఐషర్ వాహనం టైర్ పగిలి పోయింది. దీంతో వాహనాన్ని ఆపి కిందకు దిగి చూస్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. కానాహొసహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంగీత కళకు పుట్టరాజ గవాయి సేవలు భేష్
రాయచూరు రూరల్: నేటి రోజుల్లో నశించి పోతున్న సంగీత కళకు, కళాకారులకు పుట్టరాజ గవాయి అందించిన సేవలు అజరామరమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. శనివారం సోమవారపేట మఠంలో పుట్టరాజ గవాయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక యుగంలో సంగీత కళను భవిష్యత్‌లో యువతకు జ్ఞాపకం ఉండేలా చూడాలన్నారు. సాహిత్యం, సంగీతం మపిషికి మూలమన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నులై ఆడుతూ, పాడుతూ పని చేస్తే అలసిన, సొలసిన మనస్సులు కుదుట పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్లయ్య అజ్జ, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి, వీరసంగమేశ్వర శివాచార్య స్వామి, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, పంపాపతి శాస్త్రి, చెన్నయ్య స్వామి, రవి, నరసింహులున్నారు.
పురాతన బావి
జీర్ణోద్ధరణకు శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలో పురాతన బావి జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. రామమందిరం వెనుక భాగంలోని బావిని శుభ్రం చేయడానికి దారి దీప సంస్థ అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పూడిక, చెత్త, చెదారం, ఇతర పదార్థాలను తొలగించారు. నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, అమరేష్‌ల సహకారంతో బావి స్వచ్ఛతకు నడుం బిగించారు. రామమందిరం బావి నుంచి ముత్యాలమ్మ ఆలయంలో అభిషేకానికి ఈ బావి నీటిని వినియోగించేవారు.
నేత్రపర్వంగా
యల్లమ్మ దేవి రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలోని జాలహళ్లిలో శుక్రవారం సాయంత్రం యల్లమ్మ దేవి జాతర, రథోత్సవాలు జరిగాయి. జాతర, రథోత్సవాల్లో వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. సిద్దరామేశ్వర శివాచార్య, సుల్తాన్‌పుర శంభు సోమనాథ శివాచార్య ఆధ్వర్యంలో రథోత్సవం చేపట్టారు.
వైభవంగా దుర్గాదేవి దీపోత్సవం
వైభవంగా దుర్గాదేవి దీపోత్సవం
వైభవంగా దుర్గాదేవి దీపోత్సవం


