మేకెదాటు ప్రాజెక్టును చేపట్టండి
చెరసాలల్లో రాచమర్యాదలా?
శివాజీనగర: కావేరి నదిపై మేకెదాటు నీటి ప్రాజెక్టును నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీలు, పాదయాత్రలు చేసి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఆ పథకాన్ని చేపట్టాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గురువారం బెళగావి సువర్ణసౌధ అసెంబ్లీలో మేకెదాటుపై చర్చ సాగింది.
బీజేపీ ఎమ్మెల్యే అరవింద బెల్లద్ విధానసభలో మాట్లాడుతూ మేకెదాటు ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ఓట్లు పొందింది. సుప్రీంకోర్టు తమిళనాడు రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది, ఇకనైనా మేకెదాటు ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని కోరాఉ. డిప్యూటీసీఎం డీకే శివకుమార్ జవాబిస్తూ బెల్లద్ సీనియర్ నాయకుడు, నేను ఆయన తండ్రితో కలసి ఎమ్మెల్యేగా పనిచేశాను. మేకెదాటు ప్రాజెక్ట్ పై ఆరునెలల లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. మీ అందరినీ అత్యంత వినయంతో చేతులు జోడించి కోరుకొంటున్నా, మీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తే మిమ్మల్ని పిలుచుకొని వెళ్లి ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేస్తానని చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్పారు.
ఇంత వినయమా?
బీజేపీ సభ్యుడు వీ.సునీల్ కుమార్ స్పందిస్తూ ఇంత వినయ, విధేయతలతో అడుగుతున్నారు. ఇది నిజమైన డీ.కే.శివకుమార్ వారేనా? లేదా కొత్త రూపమా అని ప్రశ్నించారు. ఇంత వినయ, విధేయత ఎలా వచ్చిందని సునీల్‌కుమార్ అడిగారు. ఇమేజ్ కోసం కొన్ని సంస్థల సాయం తీసుకుంటారు, శివకుమార్ మెడలో టవల్ వేసుకోవటం కూడా ఇందులో భాగమేనా అని మరో ఎమ్మెల్యే సురేష్‌కుమార్ అడిగారు. సీఎం కావడం కోసమే ఈ వినయం అని ఎమ్మెల్యేలు చమత్కరించారు. కావేరి, మహదాయి, కృష్ణా, మేకెదాటు ప్రాజెక్టుల పనులు జరగాలంటే రూ. 1.5 లక్షల కోట్లు అవసరం, ఎక్కడి నుంచి తీసుకొస్తారని బెల్లద్ ప్రశ్నించారు.
సీఎం గగనయాన ఖర్చు రూ.47 కోట్లు
రెండున్నర ఏళ్లలో సీఎం సిద్దరామయ్య గగన విహారాలకు కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యింది. 2023 నుంచి సీఎం సిద్దరామయ్య అధికారిక పర్యటనలకు హెలికాప్టర్, ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రూ.47.38 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. విమాన ప్రయాణాలకు ఖర్చు అధికమైంది. విధానపరిషత్‌లో సభ్యుడు ఎన్.రవికుమార్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు హెలికాప్టర్, విమానాలనే ఉపయోగిస్తున్నారు.
విధానసభలో బీజేపీ డిమాండ్
డీసీఎం శివ వినయ, విధేయుడని వ్యాఖ్యలు
సర్కారు మొద్దునిద్ర పోతోంది
పరిషత్‌లో బీజేపీ ఎమ్మెల్సీ సర్జి
శివాజీనగర: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కొందరు ఖైదీలకు రాజాతిథ్య సదుపాయాలు లభించడంపై విధానపరిషత్‌లో రగడ జరిగింది. జీరో అవర్‌లో సభ్యుడు ధనంజయ్ సర్జి ప్రస్తావించారు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న దర్శన్‌కు కూడా రాచమర్యాదలు లభించాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సామాజిక మాధ్యమాల్లో నవ్వులపాలైంది. జైలు సమస్యల పరిష్కార కమిటీ నివేదిక ఇచ్చి ఏళ్లు గడిచినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. 2017లో అదే సెంట్రల్ జైలులో తమిళునాడుకు చెందిన రాజకీయ నాయకులకు వీఐపీ వసతులు సమకూర్చారు. 2022లో అనుమానిత ఉగ్రవాదులు, ఖైదీలు మొబైల్‌ఫోన్లు వినియోగించారు. ఈ స్కాముల్లో అధికారుల బదిలీ మినహాయిస్తే ఎలాంటి మార్పులు జరగలేదు అని ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. ఐజీపీ డాక్టర్ చంద్రగుప్త నేతృత్వంలో కమిటీ సుదీర్ఘ అధ్యయనంతో 4 నెలల క్రితం ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు, కానీ సిఫార్సుల అమలు చేయలేదు అని సర్కారును విమర్శించారు. కమిటీలపై కమిటీలను నియమించటం మాని ఇప్పటికే ఇచ్చిన నివేదికలను అమలుపరచాలని సర్జి డిమాండ్ చేశారు.
మేకెదాటు ప్రాజెక్టును చేపట్టండి
మేకెదాటు ప్రాజెక్టును చేపట్టండి
మేకెదాటు ప్రాజెక్టును చేపట్టండి


