తీయని కళాఖండాలు
శివాజీనగర: అక్కడికి వెళ్లగానే వివిధ ఫ్లేవర్లతో కూడిన కళాఖండాలు నోరూరిస్తాయి. బెంగళూరులో ప్రతి ఏడాది క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా కనువిందుగా కేక్ షో నిర్వహించడం తెలిసిందే. ఈసారి కూడా కేక్‌ల జాతర ఆరంభమైంది. ఓ బేకరీ సంస్థ దీనిని నిర్వహిస్తోంది. ప్యాలెస్ గ్రౌండ్స్ త్రిపురవాసినిలో గురువారం ఆరంభం కాగా, జనవరి 4వ తేదీ వరకు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది.
90 రోజులు శ్రమించి నిర్మాణం
ఈసారి లేజర్ కట్ పరిజ్ఞానంతో కేక్‌ల ఆకృతులను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కొలువైన 28 కేక్ కళాకృతులను 50 మంది కళాకారులు, చెఫ్‌లు గత 90 రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. 18 అడుగుల ఎత్తైన రాయల్ డ్రీమ్ కోట, 10 అడుగుల వేళాంగిణి మాత చర్చి, బోన్సాయ్ గార్డెన్, టర్బో రేసింగ్ కార్స్, చాకో వెడ్డింగ్ కేక్ తదితరాలు అలరిస్తున్నాయి.
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో కేక్ షో షురూ
జనవరి 4 వరకు ప్రదర్శన
తీయని కళాఖండాలు
తీయని కళాఖండాలు
తీయని కళాఖండాలు


