అతి వేగం.. ముగ్గురి ప్రాణాలు బలి
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరిపడి పక్క రోడ్డులో వెళ్తున్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు రూరల్‌లో దేవనహళ్లి శివారులోని బెంగళూరు– హైదరాబాద్ హైవే లో బుధవారం రాత్రి 11:40 సమయంలో జరిగింది. సాదళ్లికి చెందిన మోహన్ కుమార్ (33), సుమన్ (28), సాగర్ (23) చనిపోయారు. కియా కారులో చిక్కబళ్లాపురం నుంచి దేవనహళ్లి వైపు అతివేగంగా వస్తున్నారు. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎగిరి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఢీకొన్న రభసకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచారు. బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
డివైడర్‌ను ఢీకొని అవతలి
రోడ్డులోని ఆర్టీసీ బస్సుకు కారు ఢీ
దేవనహళ్లి వద్ద విషాదం


