పోలీసుల తీరును ఖండిస్తూ నిరసన
హొసపేటె: ధార్వాడలో యువ ఉద్యమ నాయకులపై కొనసాగుతున్న పోలీసుల తీరును ఖండిస్తూ, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థి సంస్థ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విజయనగర జిల్లా సమన్వయకర్త రవికిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో లక్షలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధార్వాడలో యువత నిరసన ప్రదర్శన నిర్వహించింది. పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన పోరాట కమిటీ నాయకులు, యువజన, రైతు విభాగాల నాయకులను అరెస్టు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అణచివేత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు చాలా సార్లు సమాచారం కోరినా, ఉద్యోగార్ధుల పోరాటానికి అనుమతి నిరాకరించారన్నారు. ఇప్పుడు యువత న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. జిల్లా సభ్యులు యూ.ఉమాదేవి విద్యార్థులు కే.చంద్ర, ఆకాష్, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు.


