ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిరసిస్తూ ధర్నా
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ స్కూళ్లలోకి విలీనం చేయడానికి సర్కార్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బెళగావి సువర్ణ విధాన సౌధ ముందు చేపట్టిన ఆందోళనలో సంచాలకులు బసవరాజ్ మాట్లాడారు. బెళగావి సువర్ణ విధాన సౌధలో శాసన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప బదులిచ్చారు. రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసేయడం లేదని ప్రకటించారు. అలా లిఖితరూపంలో ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సువర్ణసౌధను ముట్టడించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిరసిస్తూ ధర్నా


