డ్రగ్స్ విక్రేతల అరెస్టు, రూ.4.20 కోట్ల సరుకు సీజ్
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ పెడ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులు, కేరళవాసిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.4 కోట్ల 20 లక్షల విలువచేసే 1.12 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్స్, హైడ్రో గంజాయి, మొబైల్‌ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. నైజీరియా కు చెందిన ఒబైయ సిచిగోజీదవి, సనిసాదిక్, కేరళవాసి మహమ్మద్ ముస్తఫా అనే ముగ్గురు డ్రగ్స్‌పెడ్లర్లను బుధవారం బాగలూరు, అశోకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4.20 కోట్లు విలువచేసే డ్రగ్స్ ను వశపరచుకున్నట్లు తెలిపారు. ముస్తఫా హైడ్రోగంజాయిని తీసుకువచ్చి బెంగళూరులో అమ్ముతున్నాడు. ఇతని వద్ద నుంచి రూ.2 కోట్ల విలువచేసే సరుకును సీజ్ చేశారు. ఇటీవల ప్రముఖ డ్రగ్స్ వ్యాపారి, నైజీరియన్ ఎజికేనైగో ఓకాపార్ ను అరెస్ట్ చేసి రూ.23 కోట్ల విలువైన వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు.
డ్రగ్స్ విక్రేతల అరెస్టు, రూ.4.20 కోట్ల సరుకు సీజ్


