ధర్మస్థలపై కుట్ర అని ఆరోజే చెప్పా
● డిప్యూటీ సీఎం డీకే
బనశంకరి: ధర్మస్థల మీద వ్యతిరేకంగా కుట్ర జరిగిందని నేను ఆ రోజే ధైర్యంగా చెప్పానని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. అంతేకాక ఈ కుట్రకు కారణం ఏమిటి అనేది కూడా చెప్పానన్నారు. బుధవారం బెళగావిలో సర్క్యూట్ హౌస్‌లో డీకే శివకుమార్‌ను కేఎస్‌సీఏ నూతన అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడారు. సిట్ చార్జీషీట్‌లో ఫిర్యాదుదారులే కుట్రదారులు అని తెలిసిందని విలేకరులు ప్రస్తావించారు. నాకు ధర్మస్థల చరిత్ర గురించి తెలుసు, ఎవరూ ఇలాంటివి చేయరు అనేది తెలుసు. అందుకే ధైర్యంగా ఈ విషయం తెలిపానన్నారు. చార్జిషీట్‌లో ఏముంది అనేది చదవలేదు, ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి, అదే జరుగుతుంది. అంతిమంగా నిజం బయటపడింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య అనేక విభేదాలు ఉండడంతో ఈ కుట్ర జరిగిందని డీకే చెప్పారు.


