అభివృద్ధి పనులను ప్రారంభించిన స్వామీజీ
కోలారు : తాలూకాలోని సూలూరు గ్రామ పంచాయతీ నుగ్గలాపుర నుంచి వీరభద్ర స్వామి ఆలయం వరకు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, దేవుడి జాతర జరిగే స్థలంలో ఫ్లాట్ నిర్మాణం పనులను నాగలాపుర మఠం తేజేశలింగశివమూర్తి స్వామీజీ మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ గత ఏడాది జాతర సందర్భంగా ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ ఇచ్చిన మాట ప్రకారం రూ. 80 లక్షల నిధులు విడుదల చేయించారన్నారు. సూలూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టిహళ్లి సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైలాండహళ్లి మురళి, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.


